అంతర్గత విభేదాల వల్లే ఓడిపోయా: జయసుధ | Lost due to internal conflict: Jayasudha | Sakshi
Sakshi News home page

అంతర్గత విభేదాల వల్లే ఓడిపోయా: జయసుధ

Published Sun, Jul 27 2014 3:14 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

జయసుధ - Sakshi

జయసుధ

హైదరాబాద్: కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల వల్లే తాను ఓడిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ చెప్పారు. 2009 శాసనసభ ఎన్నికల్లో జయసుధ రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ తరపున  సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా  గెలిచారు. ఈ సారి కూడా అదే పార్టీ తరపున అక్కడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు.

నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లభించలేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా యూత్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలన్నారు. యూత్‌కాంగ్రెస్‌కు ఎన్నికలు జరపడం మంచిది కాదని  జయసుధ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement