సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా : చందుర్తి మండలం మర్రిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి విషయంలో మనస్పర్ధలు రావడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డికి చెందిన యువతి సత్య నడిగడ్డకు చెందిన ప్రశాంత్‌లు గత కొద్ది కాలంగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలంటూ సత్య, ప్రశాంత్‌పై వత్తిడి తీసుకువచ్చింది. అయితే ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు.
దీంతో సత్య మర్రిగడ్డలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది. పరువు పోయిందని భావించిన ప్రశాంత్ వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సత్య వాటర్ ట్యాంక్‌పైనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment