ముగ్గురు మంత్రుల బాధ్యతల స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా మమమూద్ అలీ బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డి-బ్లాక్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాతబస్తీ అన్నిరంగాల్లో వెనుకబడి ఉందని, తొలుత విద్యారంగాన్ని విస్తరింపజేసి ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు తీసుకరావాల్సి ఉందని మహమూద్ అలీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ, పునరావాసం, యూఎల్సీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా మహమూద్ అలీ ఉన్నారు.
నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్రావు బాధ్యతలు చేపట్టారు. రవాణా శాఖ పి. మహేందర్ రెడ్డి కూడా నేడు బాధ్యతలు చేపట్టారు.