'స్పీకర్పై అదృశ్య శక్తుల ప్రభావం' | Mallu batti vikramarka comments on telangana assembly sessions | Sakshi
Sakshi News home page

'స్పీకర్పై అదృశ్య శక్తుల ప్రభావం'

Published Fri, Mar 27 2015 3:42 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

'స్పీకర్పై అదృశ్య శక్తుల ప్రభావం' - Sakshi

'స్పీకర్పై అదృశ్య శక్తుల ప్రభావం'

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అజెండా హాస్యాస్పదంగా జరిగాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై శుక్రవారం హైదరాబాద్లో భట్టి విక్రమార్క విలేకర్ల సమావేశంలో స్పందించారు.

సభలో అధికరపక్షం టీఆర్ఎస్ నిరంకుశంగా వ్యవహరించిందని ఆరోపించారు. స్పీకర్పై అదృశ్య శక్తుల ప్రభావం ఉందని విమర్శించారు. తమకు అనుకూలంగా వ్యవహరించాలని స్పీకర్పై అధికార పక్షం ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేయడం కాంగ్రెస్కు అనవాయితీ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement