బావను చంపిన బావమరిది | Man kills Brother in law | Sakshi
Sakshi News home page

బావను చంపిన బావమరిది

Published Sat, Oct 24 2015 3:43 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో బావ బావమరుదులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ముదిగొండ (ఖమ్మం) : కుటుంబ కలహాల నేపథ్యంలో బావ బావమరుదులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో బావ మరిది కర్రతో బావ తలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం దండసిరి గ్రామంలో శనివారం జరిగింది.

గ్రామానికి చెందిన బావ, మరుదులు ఎర్గి వెంకటరత్నం(38), శ్రీనుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో శ్రీను కర్రతో వెంకటరత్నం తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement