కాంగ్రెసోళ్లకు మనుసున పడ్తలేదు | Manoharabad-Kothapalli rail line Land Puja | Sakshi
Sakshi News home page

కాంగ్రెసోళ్లకు మనుసున పడ్తలేదు

Published Wed, Mar 15 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

కాంగ్రెసోళ్లకు మనుసున పడ్తలేదు

కాంగ్రెసోళ్లకు మనుసున పడ్తలేదు

చేతి వృత్తులకు పూర్వవైభవం తెస్తామన్న మంత్రి హరీశ్‌రావు
కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైనుకు భూమిపూజ


సాక్షి, సిద్దిపేట: సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సంబరపడుతుంటే.. కాంగ్రెసోళ్లు గుండెలు బాదుకుంటున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. కొత్తపల్లి– మనోహరాబాద్‌ రైల్వేలైనుకు భూమిపూజ చేశారు. 3,344 మందికి సాదా బైనామా పట్టాలు, 774 మంది ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ. 33.74 కోట్ల బ్యాంకు లింకేజీ, 814 గ్రూపులకు 19.24 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతివృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యమిస్తే.. కాంగ్రెస్‌ వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఏప్రిల్‌ నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం కింద మరిన్ని నిధులు పెంచామని,  అదనంగా రూ. 25 వేలు పెంచి మొత్తం రూ.75,116 ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తుంటే.. కాంగ్రెసోళ్లకు మనుసున పడతలేదన్నారు.

ఇక మానసిక హింస ఉండదు
ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామని  హరీశ్‌ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తామని, వీటితో పాటు రూ. 2 వేల  విలువైన కేసీఆర్‌ కిట్టు కూడా ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement