Manoharabad railway line
-
మనోహరాబాద్ రైల్వే లైన్: కరోనా తర్వాతే కూత
సాక్షి, గజ్వేల్: ‘కరోనా దెబ్బ’ ప్రభావం కారణంగా గజ్వేల్‌కు రావాల్సిన రెగ్యులర్ ప్యాసింజర్ రైలు పట్టాలు ఎక్కే వ్యవహారంపై పెండింగ్‌లో పడుతూ వస్తోంది. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ పనులు పూర్తి కాగా రెండు నెలల క్రితం కమిషన్ ఆఫ్ రైల్వే సెఫ్టీ (సీఆర్ఎస్) క్రితం కమిషన్ ఆఫ్ రైల్వే సెఫ్టీ (సీఆర్ఎస్) తనిఖీలు విజయవంతంగా పూర్తయిన విషయం కూడా విధితమే. ఈ నేపథ్యంలోనే సీఆర్ఎస్ తనిఖీలు పూర్తయిన మూడు నెలల్లోపు రైలును పట్టాలెక్కించాలనే ఆనవాయితీలో భాగంగా.. బుధవారం దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సదర్మ దేవరాయ పర్యవేక్షణలో కాచిగూడ– మల్కాజిగిరి– మేడ్చల్– మనోహరాబాద్ గజ్వేల్‌కు వరకు రైలును నమునాగా పట్టాలపై ఎక్కించారు. అదే విధంగా లైన్‌ను మరోసారి పరిశీలించారు. ‘వర్క్ మెన్ స్పెషల్’ పేరిట రైలు పట్టాలపై పరుగులు తీసింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా..రూ.1160.47కోట్లను వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. మొత్తం ఈ లైన్ కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనుంది.. పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్‌లైన్‌కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయితే.. ప్రయాణీకులకు దూరభారం తగ్గనుంది. మనోహరాబాద్ నుంచి సిద్ధిపేట జిల్లా గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి. లైన్లపై ఉన్న వంతెన పనులను పూర్తి చేశారు. మనోహరాబాద్ దాటిన తర్వాత నాగ్‌పూర్ జాతీయ రహదారిని ఈ రైల్వేలైన్ దాటేందుకు చేపడుతున్న పూర్తయిన ఆర్ఓబీ పనులు.. గతంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్‌క్రిపాల్ రైల్వే ఇంజినీర్ల బృందంతో కలిసి జూన్ 18న తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల తర్వాత మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్న తరుణంలో.. “కరోనా’ ఉధృతి కారణంగా రైలు నడిపే అంశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే జూన్ 28న మనోహరాబాద్ మండలం రామాయపల్లి అండర్‌పాస్ వద్ధ రైల్వే ట్రాక్ కట్ట వర్షాలకు దెబ్బతింది. కొంత మేర ట్రాక్ కంకర, మట్టి కొట్టుకుపోయి లైన్ ధ్వంసమైంది. ఈ ఘటన రైల్వే శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కూడా రైలు నడపడానికి అవరోధంగా మారింది. ‘వర్క్ మెన్ స్పెషల్’ పేరిట నమునా రైలు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రాంతానికి రైలు నడపటం వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తున్న అంశంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రైల్వే అధికారులతో ఈనెల 22న హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో సమీక్షించారు. నిజానికి కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పరిశీలనలు పూర్తయిన తర్వాత కొద్ది రోజులకు రైలు నడపాలి. కానీ కరోనా వల్ల ఈ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గేంతవరకు పాక్షికంగా నమునాగా “వర్క్ మెన్ స్పెషల్’ పేరిట నమూనా రైలును నడపటానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే బుధవారం దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సదర్మ దేవరాయ పర్యవేక్షణలో కాచిగూడ–మల్కాజిగిరి–అల్వాల్–మెడ్చేల్– నుంచి వయా మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు రైలును నడిపారు. మొత్తంగా 83కిలోమీటర్ల రైలు అప్ అండ్ డౌన్ పరుగులు తీసింది. ఇందులో రైల్వే సిబ్బందితోపాటు సాధారణ ప్రజలు కూడా ఎక్కారు. అంతేకాకుండా రైల్వే లైన్‌ను మరోసారి పరిశీలన జరిపారు. ఒక రకంగా ఈ ప్రక్రియ గజ్వేల్‌కు రైలును నడిపినట్లయ్యింది. రెగ్యులర్ ప్యాసింజర్ రైలును మాత్రం కరోనా ప్రభావం తగ్గాకే అనుమతి ఇవ్వనున్నారు. ఈ అంశాన్ని గజ్వేల్ ప్రాంతంలో రైల్వేలైన్ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ జనార్థన్ ధృవీకరించారు. -
కొత్త ఏడాదిలో రైలు కూత
తూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్): నూతన సంవత్సరంలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మధ్యలో రైలుకూత వినపడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి , రైల్వే చీఫ్ ఇంజినీర్ రమేశ్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డితో కలిసి మనోహరాబాద్, గజ్వేల్ రైల్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే మార్గాన్ని తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. అలాగే మనోహరాబాద్, గజ్వేల్ రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని సంబంధిత రైల్వే అధికారులకు సూచించారు. మనోహరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు వద్ద రూ.కోటి 50లక్షలతో ఆర్అండ్బీ రోడ్డు, అండర్‌బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధుల ద్వారా మనోహరాబాద్ సమీపంలోని 12 గ్రామాల ప్రజలకు అనేక మౌలిక వసతులు కలుగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనులను రానున్న మూడు నెలల్లో పూర్తిస్తామని మంత్రి చెప్పారు. మనోహరాబాద్, గజ్వేల్ మధ్య రైల్వేలైన్ 31 కిలోమీటర్లు ఉండగా ఇప్పటి వరకు భూ సేకరణ పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఈ రైల్వేలైన్ మార్గంలో ఉన్న అటవీశాఖ భూములకు సైతం అనుమతులు పొందినట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల అనుమతులు.. ప్రస్తుతం 17 కిలోమీటర్ల రైల్వే పనులు కూడా పూర్తి చేశామని, మరో 14 కిలోమీటర్ల మేర పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆ పనులను వేగవంతం చేయాలని రైల్వే శాఖ అధికారులను కోరినట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు నెలలో పనులు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తిచేస్తామని వివరించారు. ఈ రైలుమార్గం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. జాతీయ రహదారులపై క్రాసింగ్‌ల కోసం ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇటీవల ఢిల్లీలో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ దక్షిణ మధ్య రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో కలిసి చర్చించి తగు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే అన్ని రకాల అనుమతులను పొందినట్లు వివరించారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక మేరకు సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్, తూప్రాన్, రాయపోల్ మండలాలకు ఉపయోగకరంగా ఉండేలా బేగంపేటలో రైల్వేస్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్స్ కమిటీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, గఢా హన్మంతరావు, జెడ్పీటీసీ సుమణ పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులతోపాటు మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెసోళ్లకు మనుసున పడ్తలేదు
►చేతి వృత్తులకు పూర్వవైభవం తెస్తామన్న మంత్రి హరీశ్‌రావు ►కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైనుకు భూమిపూజ సాక్షి, సిద్దిపేట: సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సంబరపడుతుంటే.. కాంగ్రెసోళ్లు గుండెలు బాదుకుంటున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైనుకు భూమిపూజ చేశారు. 3,344 మందికి సాదా బైనామా పట్టాలు, 774 మంది ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ. 33.74 కోట్ల బ్యాంకు లింకేజీ, 814 గ్రూపులకు 19.24 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతివృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిస్తే.. కాంగ్రెస్ వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మరిన్ని నిధులు పెంచామని, అదనంగా రూ. 25 వేలు పెంచి మొత్తం రూ.75,116 ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తుంటే.. కాంగ్రెసోళ్లకు మనుసున పడతలేదన్నారు. ఇక మానసిక హింస ఉండదు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామని హరీశ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తామని, వీటితో పాటు రూ. 2 వేల విలువైన కేసీఆర్ కిట్టు కూడా ఇస్తామన్నారు.