కండరాయి గుట్టలో మావోయిస్టుల డంప్ | Maoists dump | Sakshi
Sakshi News home page

కండరాయి గుట్టలో మావోయిస్టుల డంప్

Published Mon, Jul 27 2015 4:45 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Maoists dump

నలుగురిని విచారిస్తున్న పోలీసులు
 
 పెద్దదడ్గి (బిచ్కుంద): పెద్ద దడ్గి గ్రామంలోని కండరాయి గుట్టలో మావోరుుస్టులదిగా భావిస్తున్న డంప్ బయటపడింది. నలుగురిని పొలీసులు విచారిస్తున్నారు. ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం... పెద్ద దడ్గి గ్రామానికి చెందిన అంజ బోయి పెంట బోయి, అంజబోయి హన్మాబోయి, సాయిలు కలిసి మూడు రోజుల కిందట కండరారుు గుట్టలో మేకలు మేపుతుండగా ఒక బండరాయి కింద పాతిపెట్టిన సూట్‌కేసు కనబడింది. మరుసటి రోజున వచ్చి, దానిని తవ్వి తీసుకెళ్లాలని అనుకున్నారు.

మరుసటి రోజున సాయిలు, అం జబో యి పెంటాబోయి వెళ్లి చూసేసరికి అక్కడ సూట్‌కేసు కనిపిం చలేదు. నువ్వు తీసావంటే.. నువ్వు తీసావంటూ వారు గొడవపడ్డారు. ఆ తరువాత పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యా దు చేసుకున్నారు. అక్కడ సూట్‌కేసును చూసింది నిజమేనని వారు చెప్పారు. వీరితోపాటు మరో వ్యక్తి (రాజు)ను పొలీసు లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గుట్ట లో గతంలో సలీం దళం, దుర్గాగౌడ్ దళం సంచరించాయని, ఈ డంపు కూడా వారిదే కావచ్చని గ్రామస్తులు చెబుతున్నారు.

 సలీం దళం మకాం
 పెద్దదడ్గి గుట్టలో 20 ఏళ్ల క్రితం సలీం దళం మకాం వేసింది. ఇక్కడి నుంచే జుక్కల్, ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కార్యకలాపాలు సాగించింది. వసూలు చేసిన డబ్బును గుట్టలో ఈ దళం దాచిపెట్టిందంటూ 1989లో అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి. 1993లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సలీం మృతి చెందాడు. సలీం దళంలోని ముఖ్యుడైన మౌలానా కూడా తక్కడపల్లి గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయూడు.

వీరు అప్పట్లో జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని పటేళ్లను, పట్వారీలను, భూస్వాములను, పెద్ద వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి దడ్గి, కొమలంచ, లింగంపెట్, సింగీతం గుట్టలలో దాచిపెట్టారని అప్పట్లో ప్రజలు చెప్పుకున్నారు. నాలుగేళ్ల క్రితం రాజాపూర్ గ్రామ శివారులో కూడా దళం దాచిపెట్టిన నగదు డంప్ దొరికినట్టు పుకార్లు వ చ్చాయి. దళ నాయకుడు సలీం ఎన్‌కౌంటర్ తర్వాత అతని వద్ద దొరికిన డైరీ ద్వారా ‘దడ్గి శివారులో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నారుు’ అనే సమాచారం పొలీసులకు తెలిసింది. వారు అప్పట్లో  దడ్గి గుట్టను తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి డంప్ లభించలేదు. ఆనాడు ఆ దళం దాచిపెట్టిన డంపే ఇప్పుడు దొరికిందని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement