బోయిన్‌పల్లి టు కాకినాడ.. బిడ్డనెత్తుకుని ఓ తండ్రి పయనం ,ఉప్పల్‌లో..
లాక్‌డౌన్‌లో వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. వారితో పాటు వివిధ కారణాలతో నగరంలో ఇరుక్కుపోయిన వారు సైతం తమను సొంత ఊళ్లకు పంపించాలంటూ పోలీసులను వేడుకున్నారు. దీంతో పోలీసులు వారికి పాస్‌లు జారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొంతమంది వలస కార్మికులు మాత్రం కేవలం ఓ బ్యాగు భుజానికి తగిలించికొని ఎర్రటి ఎండలో సొంత రాష్ట్రాలకు కాలినడకన బయలుదేరారు. సోమవారం నగరంలో ఎక్కడ చూసినా వలస కూలీలే కనిపించడం విస్తుగొలిపింది.
ఫ్యామిలీ ప్యాక్ సర్..
కూటి కోసం.. కూలి కోసం.. పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చిన వలసజీవులకు ఎంత కష్టం.. ఎంత కష్టం.. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేక పస్తుండాల్సిన పరిస్థితి. ఇక ఇక్కడ ఉండలేమంటూ.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలంటూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు పోలీస్‌స్టేషన్లకు వందలాదిగా తరలివచ్చారు. ఝార్ఖండ్‌కు చెందిన ఓ వలస కార్మికుడు తన భార్యాబిడ్డలతో సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ ఆధార్ కార్డులు చూపిస్తూ సొంతూరికి పంపించాలని ప్రాధేయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment