హైదరాబాద్ : గోదావరి నదిపై పలు బ్యారేజీల నిర్మాణంతో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి పథకాలను వేగవంతం చేయడంతో పాటు ప్రతి ఎకరాకు నీరందించేందుకు అపర భగీరథుడిలా కృషి చేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు, ఉన్నతాధికారుల బృందం ఈ నెల 7న ముంబైకి వెళ్లి, 8న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో ఒప్పందాలు చేసుకోనుండడం చారిత్రాత్మకమైనదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనే నాలుగు బ్యారేజీల నిర్మాణాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు జిల్లా వాసుల తరుపున ధన్యవాదాలు తెలిపారు.
'కోటి ఎకరాలకు సాగునీటి కోసం సీఎం కృషి'
Published Fri, Mar 4 2016 8:20 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement