సమష్టి కృషితోనే గ్రామ‘జ్యోతి’
జిల్లాను అభివృద్ధిలో ముందు నిలపాలి
అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం
అవగాహన సమావేశంలో మంత్రులు ఐకే.రెడ్డి, రామన్న
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రా రంభిస్తున్న గ్రామజ్యోతి పథకం విజయవంతమయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు సహకరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ ధర్మాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మండలంలోని మావలలో గ్రామజ్యో తి మార్పు మార్గదర్శకాలపై శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో తొలు త మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ఆది లాబాద్ జిల్లాను ముందంజలో నిలిపేం దుకు ప్రతి ఒక్కరు కృషి చేయలన్నారు.
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నారని, గ్రామాల అభివృద్ధితోనే మండలాలు, ఆపై జిల్లాలు, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుం టూ సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో నెల కొన్న సమస్యల పరిష్కారం కోసం మన ఊరు మన ప్రణాళికలో గుర్తించిన పనులు చేపట్టేం దుకు ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వం రూ. 2,418 కోట్లు ఇవ్వనుందని వివరించారు. ఈ మేరకు ఈనెల 17 నుంచి 23వరకు ఏడు రోజు ల పాటు గ్రామాల్లో నిర్వహించనున్న గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామస్తులు అధికారులకు సహకరించాలని మంత్రి జోగు రామన్న ఈ సందర్భంగా కోరారు.
వసతుల కల్పనకే..
గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించడం కోస మే రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజ లను చైతన్య వంతులను చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అభివృ ద్ధి చెందిన గ్రామాలను ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాలను తీర్చిదిద్దాలని కోరారు. సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇండ్లు నిర్మించనుండగా, ప్రతీ నియోజకవర్గంలో రూ.5లక్షల చొప్పున వెచ్చించి 500 గృహాలు నిర్మిస్తామని తెలిపారు. ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు హేమాజీ మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీలు, ఎంపీటీసీలకు భాగస్యావమ్యులు చేసి నిధులు మంజూరు చేయూలని కోరారు.
దండేపల్లి ఎంపీపీ మం జుల మాట్లాడుతూ ప్రభుత్వం ఓ పక్క మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెబుతూనే, ఇప్పటికే నిర్మించిన వాటికి బిల్లులు చెల్లించడం లేదని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్లకు కూడా బిల్లులు రాలేదని తెలిపారు. ఇలాంటి సమస్యలపై గ్రామజ్యోతి సదస్సులో ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి ఐకే.రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పై సీబీఐడీ విచారణ కొనసాగుతున్నందున బిల్లులు చెల్లించలేకపోతున్నామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్, చెన్నూర్, ముథోల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, విఠల్‌రెడ్డి, చిన్న య్య, జేసీ సుందర్ అబ్నార్, సీపీవో షేక్ మీరా, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, ఏఎస్పీలు రాధికాశర్మ, పనస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.