24 గంటల కరెంటు వద్దంటున్నారు | Minister KTR comments about power supply | Sakshi
Sakshi News home page

24 గంటల కరెంటు వద్దంటున్నారు

Published Thu, Aug 3 2017 3:31 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

24 గంటల కరెంటు వద్దంటున్నారు - Sakshi

24 గంటల కరెంటు వద్దంటున్నారు

మంత్రి కేటీఆర్‌
 
సిరిసిల్ల: వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నా.. కొందరు రైతులు వద్దంటున్నారని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం హరితహారంలో ఆయన మొక్కలు నాటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం  మాట్లాడుతూ.. తాము నిరంతరాయంగా కరెంట్‌ ఇస్తున్నా.. తమకు వద్దని కోరుతూ రైతులు తనకు మెసేజ్‌లు పెడుతున్నారని అన్నారు. గతంలో ఒకటి, రెండు గంటలు ఎక్కువ కావాలని ప్రాధేయపడేవారని, ఇప్పుడు వద్దనే పరిస్థితికి చేరారన్నారు. రాష్ట్రంలో 25 లక్షల బోర్లు ఉన్నాయని, అందరు ఒకేసారి బోర్లు వేయడం ద్వారా భూగర్భ జలాలు సరి పోవడం లేదని, బోర్లు ఎత్తిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గోదావరి జలాలతో కాళేశ్వరం ద్వారా తెలంగాణలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని వివరించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి, సిరిసిల్ల ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడుకుందామని, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందామని సూచించారు. నేరెళ్ల దళితులపై పోలీసులు ‘థర్డ్‌ డిగ్రీ’ప్రయోగించిన ఘటనపై కేటీఆర్‌ ఏమీ మాట్లాడలేదు. ప్రతిపక్షాలు నేరెళ్ల ఘటనపై తీవ్రంగా స్పందించినా.. కేటీఆర్‌ మౌనం వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement