మేడ్చల్: అనాథాశ్రమంలో పెరిగిన యువతికి మంత్రి మల్లారెడ్డి అన్నీ తానయ్యారు. తండ్రి సా ్థనం వహించి వివాహం చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని గౌరీ ఆశ్రమానికి చెందిన అనాథ యువతి పుష్పకు, విజయవాడకు చెందిన కిషోర్‌తో ఆదివారం వివాహమైంది. మంత్రి మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పనారెడ్డి కన్యాదానం చేశారు. పుష్ప పేరిట రూ.2.5 లక్షలు డిపాజిట్ చేయించారు. పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.25 వేల నగదు అందజేశారు. నూతన వధూవరులను మంత్రి దంపతులు ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment