సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ వద్ద నెలకొల్పనున్న సుగంధ ద్రవ్యాల పార్క్ నిర్మాణ పనులపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్యాల పార్క్ కోసం రూ. 30 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులు విక్రయించేందుకు పార్క్ ఉపయోగపడుతుందన్నారు. పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించడం పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. మొదటిదశలో పంట వేలానికి ప్లాట్‌ఫామ్, షెడ్లు నిర్మించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులు, వ్యాపారులకు విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment