నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు బంధువు ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
మిర్యాలగూడ :నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు బంధువు ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాలివీ..ఎమ్మెల్యే భాస్కర్‌రావు బంధువు పొట్రు సుధీర్(38) హైదరాబాద్‌లో సాప్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి మిర్యాలగూడ బైపాస్ రోడ్డులోని అగ్రిగోల్డ్ వెంచర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం సుధీర్ ను ఢీకొంది. తీవ్ర గాయాలతో విగతజీవిగా పడి ఉండగా శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సుధీర్ మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.