సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య నిరసన | MLA RAJAIAH protest on CM's comments | Sakshi
Sakshi News home page

సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య నిరసన

Published Fri, Dec 30 2016 12:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య నిరసన - Sakshi

సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య నిరసన

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ, నాయకులపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిరసనకు దిగారు. గురువారం స్పీకర్‌కు లేఖను అందజేశారు. ఆ తర్వాత శాసనసభ ఆవరణ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. కేంద్ర భూసేకరణ చట్టం–2013ను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ చట్టంలోని ప్రమాదకరమైన నాలుగు అం శాలను తొలగించాలన్నారు. సీపీఎం నాయ కులు అసాంఘిక శక్తులని 2013 కేంద్ర చట్టం దిక్కుమాలినదని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement