
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కోతల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్ర్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ఆర్థిక మాంద్యం దిశగా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు మిగిల్చిన సంపదను ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలన తీరుతోనే ఆర్థిక మాంద్యం వచ్చిందన్నారు. దాన్ని కేంద్రం మీదకు రుద్దుతున్నారని తూర్పారబట్టారు.
ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లు అని ముఖ్యమంత్రి విమర్శించారని..ఆయన ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారో సమాధానం చెప్పాలని సీతక‍్క డిమాండ్ చేశారు. బడ్జెట్లో కేటాయింపులు అద్భుతం గా ఉన్నాయని.. కాని చేతలు బాగోలేవన్నారు. ఉన్న నిధులన్నీ ఖర్చుపెట్టి..నేడు భూములు అమ్ముతానంటూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఖజానా ఖాళీ అయితే నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలెందుకని ప్రశ్నించారు. ఒక్క కొత్త గురుకుల భవనం కూడా కేటాయించాలేదని మండిపడ్డారు. ప్రజలు డెంగీ,మలేరియాతో బాధపడుతుంటే ఆసుపత్రులకు బడ్జెట్ కూడా పెంచలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment