మంత్రి మహేందర్‌రెడ్డి
చేవెళ్ల: పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో దేవీప్రసాద్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో బుధవారం పట్టభద్రులు, ఉద్యోగ సంఘాలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడు తూ బంగారు తెలంగాణ సాధన కో సం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో దేవీప్రసాద్‌రావు చురుకైన పాత్ర పోషించారన్నారు. ఉద్యోగులనందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలోనే ప్రధాన మలుపుగా భావిస్తున్న సకల జనుల సమ్మెను విజయవంతం చేయించిన ఘనత ఆయనదేనన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్ కేవలం 25 శాతంగానే ఉందని, ఈసారి ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఓటువేసేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరును కలిసి దేవీప్రసాద్‌రావుకు ఓటు వేసేలా పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క రూ దోహదపడాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని చె ప్పారు. ఈనెల 10న చేవెళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికలపై పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌తో జరగనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ అభియాన్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, రిటైర్ట్ ప్రధానోపాధ్యాయులు ఏ.మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు అంజయ్య తదితరులు మాట్లాడారు.
దేవీప్రసాద్‌రావు ఎన్నికల ప్రచార పోస్టర్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు విడుదల చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్‌గుప్త, టీఆర్‌ఎస్ మం డల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, నియోజకవర్గ యువజన నాయకులు మహేశ్వర్‌రెడ్డి, జిల్లా, నియోజకవర్గ నాయకులు బర్కల రాంరెడ్డి, మాసన్నగారి మాణిక్‌రెడ్డి, ఆగిరెడ్డి, మగ్భూల్ షరీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘ఉద్యమం’లో దేవీప్రసాద్ పాత్ర కీలకం
Published Wed, Mar 4 2015 11:34 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement