తల్లీ, కుమారుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. కరీంనగర్‌జిల్లా సిరిసిల్లలోని బీవై నగర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
సిరిసిల్ల (కరీంనగర్ జిల్లా) : తల్లీ, కుమారుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. కరీంనగర్‌జిల్లా సిరిసిల్లలోని బీవై నగర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బీవై నగర్‌కు చెందిన లింగం(40), అతడి తల్లి లక్ష్మి(60) సోమవారం తమ ఇంట్లో విగత జీవులుగా పడి ఉండగా గ్రామస్తులు గమనించారు. వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా లింగం వివాహితుడు. మద్యానికి బానిసై భార్య లావణ్యను హింసిస్తుండడంతో ఆమె తన కుమారుడ్ని తీసుకుని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లోని తల్లిగారింటికి ఆరు నెలల క్రితమే వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు.