బలవంతపు చేరికలు..మా సంస్కృతి కాదు
నల్లగొండ రూరల్ : పార్టీలో చేరమని ఏవరిని ఓత్తిడి చేయడం లేదు... ఎలాంటి ఆశ చూప డం లేదు... ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని బం డారు గార్డెన్స్‌లో పలువురు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్ చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడారు. తమ పార్టీలోకి ఎవరిని బలవంతంగా చేర్చుకోవడం లేదని.. ఆ సంస్కృతి వారసులు నాడు చంద్రబాబు, ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులనేనన్నారు. కోమటిరెడ్డి నియోజవర్గ నాయకుడేనని రాష్ట్ర స్థాయి నాయకుడు కాదన్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు తెలంగాణ ప్రజలకు అండ గా ఉండకుండా ఆంధ్రా ఏజెంట్లు గా అవతరించారన్నారు. సీఎల్పీ నేత జా నారెడ్డి టీడీపీ విధానాలను ప్రశ్నించడం లేదన్నారు. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్లనే రైతుల పరిస్థితి బాగలేదన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం రుణమాఫీని అమలు చేస్తుందన్నారు. అర్హులైన వారికి ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందజేస్తామన్నారు.
చేరికలు మలి ఉద్యమానికి నాంది
వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడం బంగారు తెలంగాణ మలీ ఉద్యమానికి నాంది అని టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రభుత్వం అమ లు చేస్తుందన్నారు.
టీడీపోళ్లకు ప్రశ్నలే దొరకడం లేదు
టీడీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అడిగేందుకు ప్రశ్నలు దొరకడం లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎద్దేవా చేశారు. గతంలో రాష్ట్రంలో 28 వేల ఫించన్లు ఉంటే నేడు 31 లక్షల మందికి అందనున్నాయన్నారు.
అభివృద్ధి చేస్తాం : దుబ్బాక
సమష్టిగా ముందుకు సాగుతూ నల్లగొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి తెలిపారు. మాయమాటలు చెప్పి డబ్బులు మూట కట్టుకుని కోమటిరెడ్డి ప్రజలను వంచిం చారన్నారు.
పార్టీలు ఖాళీ అవుతున్నాయనే సభ్యత్వ నమోదు : పల్లా
కాంగ్రెస్, టీపీడీ పార్టీలు ఖాళీ అవుతుండడంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారని టీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ ఇన్‌చార్జ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రమాదబీమా, వైద్య సౌకర్యం, ఉద్యోగ ప్రోత్సాహం, చేస్తామని ప్రకటనలు చేసినా టీడీపీలో ఏవ రూ చేరడం లేదన్నారు. అంతకుముందు నల్లగొండ పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో నాయకులు బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీను, బోయపల్లి కృష్ణారెడ్డి, బొర్ర సుధాకర్, జమాల్‌ఖాద్రీ, గోలి అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని కవితా రమేష్, ఖమ్యూంబేగ్, బొంత రేణుకా వెంకన్న, తక్కి, తక్కెళ్ల హారిక అశోక్, బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.