ప్రతీకాత్మక చిత్రం
బషీరాబాద్(తాండూరు) : పంచాయతీ ఎన్నికల కోసం కొత్తగా రూపొందించిన ఓటరు జాబితా త ప్పుల తడకగా మారింది. పదేళ్ల కిందట మృతి చె ందిన వారి పేర్లు సైతం ఓటరు జాబితాలో చోటుచేసుకున్నాయి. అలాగే ఒక్కో ఒటరు పేరు రెండు, మూడు వార్డుల్లో కూడా వచ్చాయి. వారితో పాటు కొత్తగా నమోదైన ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చా రు.
బషీరాబాద్ మండలంలో ప్రదర్శించిన కొత్త ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా మారింది. చనిపోయిన వ్యక్తుల పేర్ల ను ఇప్పటికీ అలా గే జాబితాలో కొనసాగించడంతో ఓ టింగ్ సమయంలో అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నా యి. బషీరాబాద్ పంచాయతీ పరిధిలోని 7, 8 వా ర్డుల్లో 30 మంది వరకు చనిపోయిన వారి పేర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారి పేర్లను తొలగించడానికి సాహసించడంలేదు.
అలాగే ఒక వార్డులో ఉన్న ఓటరు పేరు మరో వార్డులోనూ ఉన్నాయి. బషీరాబాద్ గ్రామానికి చెందిన అబ్దుల్ అఫీజ్ మూడేళ్ల కిందట చనిపోయారు. కానీ అతడి పేరు జాబితాలో మా త్రం తొలగించలేదు. అలాగే అమీద్‌ఖాన్, అమి నోద్ధీన్, ఖాసీం సాబ్ అనే వ్యక్తులు చనిపోయిన వారి పోర్లు జాబితాలో దర్శనమిస్తున్నాయి. ఇలా ప్రతీ వార్డులోనూ ఇలాంటి తప్పులే చోటుచేసుకున్నాయి.
మండలంలోని ప్రతి గ్రామంలో కనీసం పది శాతం మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు ఉ న్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. కానీ ఆ పే ర్లపై రాజకీయ పార్టీలు అభ్యంతరం చెబితే తొలగి స్తామని, లేకుంటే వారి కుటుంబ సభ్యులెవరైనా చనిపోయినట్లు ఆధారాలు చూపితే తొలగి స్తామని పంచాయతీ అధికా రులు చెబుతున్నారు. తొలగించే అధికారం కూడా కేవలం తహసీల్దార్‌కు మాత్రమే ఉందని బషీరా బాద్ ఎంపీడీఓ ఉమాదేవి చెప్పారు.
బషీరాబాద్ మండలం ఓటర్లు 34,367
బషీరాబాద్ మండల జనాభా 43,562 ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇందులో 36 పంచాయతీలకు గాను 34,367 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా తేలింది. మండలం మొత్తం ఓటర్లలో 17,771 మంది మహిళా ఓటర్లు ఉండగా, 16,596 ఓటర్లు పురుషులు ఉన్నారు.
గతంలో 16 పంచాయతీలు ఉండగా తాండూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా 20 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో 220 జనాభా ఉన్న హంక్యానాయక్‌తండా కూడా కొత్త పంచాయతీగా ఏర్పడడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment