
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, అంబర్‌పేట్ శంకర్ సోదరుడు సి.నర్సింగ్‌రావు (67) సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నర్సింగ్‌రావును కుటుంబ సభ్యులు గత నెల 27న ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 8న ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నర్సింగ్‌రావు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో పెద్ద దూమారం చెలరేగిన సంగతి విదితమే. ఈ ఘటనపై నర్సింగ్‌రావు కుటుంబ సభ్యులతోపాటు వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, హైబీపీ, మధుమేహం, లంగ్స్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, న్యుమోనియా తదితర రుగ్మతలతో బాధపడుతున్న నర్సింగ్‌రావు ఆరోగ్యపరిస్థితి విషమించి సోమవారం కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment