
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో అయ్యప్ప దేవాలయం పక్కన ఉన్న మెట్లపై నుంచి అర్ధరాత్రి ఓ నల్లజాతి యువకుడిని అదే జాతికి చెందిన నలుగురు యువకులు కాళ్లను తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్తూ తమతో పాటు తీసుకొచ్చిన కారులో ఎక్కించి తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. తాను రానంటూ సదరు యువకుడు ఏడుస్తూ పారిపోవడానికి యత్నిస్తుండగాపట్టుకొని కాళ్లకు తాళ్లు వేసి ఈడ్చుకెళ్లి కారులో(ఏపీ 10బీఈ 5107) కూర్చోబెట్టారు.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీరు ఎవరైందీ, పోలీసులు కారు నంబర్ ఆధారంగా విచారణ చేపట్టగా ఆ కారు నంబర్ తప్పు అని తేలింది. ఆ యువకులు ఎవరు.? తీసుకెళ్లిన నల్లజాతీయుడు ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.