సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:డీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకానికి తెర పడినట్లే. ఇక నుం చి విద్యా శాఖ ద్వారా కాకుండా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వా రా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు మూడు రోజులుగా విద్యా శాఖ నుంచి జిల్లాలవారీగా ఖాళీల వివరాలను సే కరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమం లో జిల్లాలో ఖాళీగా ఉన్న 1,344 ఉపాధ్యాయ పోస్టులు త్వరలో టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే భ ర్తీ కానున్నాయి.
ప్రస్తుతం ఇదీ పరిస్థితి
జిల్లాలో 1,573 ప్రాథమిక పాఠశాలలు, 975 ప్రాథమికోన్నత పాఠశాలలు, 465 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రు. 10 వేల మంది టీచర్లు విద్యాబోధన చేపడుతున్నారు. 1,344 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి రెండు సంవత్సరాలుగా సందిగ్ధత నెలకొంది. గత ఏడాది జనవరి 29న ప్రభుత్వం డీఎస్‌సీ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలను వెల్లడించింది. అనంతరం గత డిసెంబర్ వరకు మళ్లీ పోస్టులను పునఃప రిశీలించింది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు పాఠశాల విద్యా శాఖకు నివేదిక కూడా సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున 2014 లోనే డీఎస్‌సీ ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిం చారు. గత ఏడాది మార్చిలో టెట్‌ను కూడా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, విద్యారంగంలో వివిధ సంస్కరణలు రావడంతో పోస్టుల భర్తీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఘంటా చక్రపాణి పోస్టుల భర్తీ మే నెలలో జరుగవ చ్చని ప్రకటించారు. ముఖ్యమైన పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించామని చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాలో గతంలో నిర్వహించిన డీఎస్‌సీ రోస్టర్ పాయింట్ విధానం లేదా మెరిట్ విధానం ద్వారా టీఎస్‌పీఎస్‌సీ నుంచి టీచర్ పోస్టుల నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
త్వరలోనే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలవారీగా ఖాళీల వివరాలను సేకరించే ప్రక్రియను పీఎస్‌సీ అధికారులు వేగవంతం చేసినందున, ఉత్తర్వులు ఈ నెలాఖరులో వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కొత్త విధానంపై అభ్యర్థుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
నో డీఎస్‌సీ!
Published Wed, Jan 7 2015 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement