
'టీడీపీకి తెలంగాణలో భవిష్యత్ లేదు'
హైదరాబాద్: టీడీపీకి తెలంగాణలో భవిష్యత్ లేదని ఆ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ...తమతో గొడవ పడొద్దని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. కేసీఆర్ ను తిడితే అడ్రస్ లేకుండా పోతారని అన్నారు. రేవంత్రెడ్డి ఓ బచ్చా అంటూ మండిపడ్డారు.
కాంగ్రెసోళ్ల భరతం పడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన కుంభకోణాలను బయటపెడతామన్నారు. లంచాలకు మంచాలు వేసిన చరిత్రి నీది అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై విరుచుకుపడ్డారు. పొన్నాల మాట్లాడకుండా ఉంటేనే మంచిదని నాయిని సలహాయిచ్చారు.