విచారణ లేదు.. ఎన్నికలు లేవు | no inquiry....no elections | Sakshi
Sakshi News home page

విచారణ లేదు.. ఎన్నికలు లేవు

Published Mon, May 26 2014 2:41 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

no inquiry....no elections

బీర్కూర్,న్యూస్‌లైన్: రైతుల రుణాల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బీర్కూర్ మండలంలోని దామరంచ సింగిల్ విండో పాలక వర్గాన్ని రద్దు చేసిన అధికారులు తిరిగి ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం చూపుతున్నారు. మొదట్లో రుణాల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అధికారులు ఆ తరువాత పట్టించుకోలేదు. దామరంచ సింగిల్ విండోలో గతంలో పని చేసిన అధ్యక్ష, కార్యదర్శులు సుమారు రూ. 1 కోటి 60 లక్షలు దుర్వినియోగం చేసినట్లు రైతులు ఆరోపించారు.

 ఈ మేరకు రైతులు ఆధారాలను బయటపెట్టారు. పలు రకాలుగా రైతులకు రుణాలు  రూ .1,78,87,695 వచ్చాయి. దీంట్లో స్వల్ప కాలిక రుణాలు రూ. 1,13,00712, రీ షెడ్యూల్ ద్వారా, రూ. 12,05,505 నార్మల్ లాంగ్ టర్మ్ రుణాలు రూ. 88,325, ఎల్‌టీ నాబార్డు ద్వారా రూ. 2,62,679 , నాబార్డు రీషెడ్యూల్ ద్వారా రూ. 46,88,407, నాబార్డు  రీ షెడ్యూల్‌ద్వారా రూ. 3,01,042 వచ్చాయి. అయితే మొదటి సారి రూ. 67,59,973, రెండవ సారి రూ. 67,65,869 మాఫీ వచ్చింది. దీంతో పాటు వైద్యనాథ్ కమిటీ ద్వారా సొసైటీకి రూ. 25,10,471, పీఎం ఫండ్ ద్వారా రూ. 16,42,103 వచ్చాయి. అయితే ఇంత జరిగినా రైతులు ఒక్క రూపాయి కూడా లోన్లు తీసుకోకుండానే అధ్యక్ష, కార్యదర్శులు రైతుల పేరు మీద లక్షలకు లక్షలు స్వాహా చేశారు.

 మొదటి విడత, రెండవ విడతలో రుణ మాఫీ కాని వారికి వైఎస్ ప్రభుత్వం రూ. 5000 ఇన్సెంటీవ్ ప్రకటించగా సొసైటీ పరిధిలోని 567 మంది రైతుల పేరు మీద  ఇన్సెంటీవ్ తెప్పించి వారిలో కేవలం 250 మంది వరకు రైతులకు మాత్రమే బోనస్‌ను అందించి మిగిలినవి వారి జేబుల్లో వేసుకున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిదేళ్ల క్రితం చనిపోయిన దావోరి విఠల్(అకౌంట్ నంబర్ 180) అ నే రైతు పేరు మీద డబ్బులు తీసుకుంటూ దర్జాగా కాలక్షేపం చేశారు. రూపాయి కూడా రుణం తీసుకోని రైతుల పేరు మీద కూడా వేలకు వేలు అప్పులు ఉన్నట్లు చూ పిస్తున్నారు. రైతుల పేరు మీద వారికి తె లియకుండా రుణాలు పొం దడమే కా కుండా ఇవన్ని సక్రమంగానే జరిగాయం టు అధికారులను గతంలో న మ్మించడానికి ప్రయత్నించారు.

ప్రతి సంవత్సరం రుణాలు  తీసుకుని సక్రమంగా చెల్లించే వారి పేరు మీద కూడా వీరిరువురు లోన్లు తీసుకున్నట్లు తేలింది. మరో నమ్మలేని నిజం ఏమిటంటే నవంబర్ 31, 2006లో గడ్డం లక్ష్మి పేరు మీద రూ. 35 వేలు, శేక్ హుస్సేన్ పేరు మీద రూ. 38,500 కాజేశారు. అసలు ప్రపంచంలోని ఏ క్యాలండర్ చూసినా నవంబర్ 31 ఉండనే ఉండదు. ఈ ఒక్క విషయం చాలు వారు ఎంతగా రైతులకు వచ్చే నిధులు  స్వాహా చేశారో అర్థం అవుతుంది. లోన్లు తీసుకుని రుణాలు చె ల్లించిన వారికి కూడా రుణ మాఫీ తీసుకువచ్చి ఈ డబ్బులను సైతం సొంతానికి వా డుకున్నారు. అయితే గతంలోనే దీనిపై స హకార బ్యాంక్ అధికారులు విచారణ జ రిపి కమిటీని రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. సుమారు రూ. 1కోటి 60 లక్షలు దుర్వినియోగం అయినా బాధ్యులైన వారిపై ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.

 ఎన్నికల గురించి మరిచిపోయిన అదికారులు
 దాదాపుగా 17 నెలలుగా దామరంచ సింగిల్ విండోకు ఎన్నికలు జరపకుండా, అటు విచారణ సైతం పూర్తి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంపై దామరంచ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్వాకంపై రైతులు మండిపడుతున్నారు. త్వరితగతిన విచారణ జరిపించి దామరంచ సింగిల్ విండోకు ఎన్నికలు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement