ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రైతులకు పెట్టుబడి సాయం అందే వరకు బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇందిరానగర్‌లో సీఎం సభకు ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రైతు బంధు కింద రూ.12 వేల కోట్లతో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ నెల 10న శ్రీకారం చుడుతోందన్నారు.
బ్యాంకుల్లో నగదు కొరత రాకుండా కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. తాను ఈ విషయంలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలసి మాట్లాడినట్లు వెల్లడించారు. రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి లక్ష మంది రైతులు హజరుకానున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం సభకోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. అంతకు ముందు మంత్రి హెలిప్యాడ్, సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment