సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్కు వద్ద ఈ నెల 19న అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపిన కేసులో రిమాండ్‌లో ఉన్న కానిస్టేబుల్ ఓబులేసు (37)ను పోలీసు కస్టడీకి అప్పంచాలని నాంపల్లి కోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు చంచల్‌గూడ జైలులో ఉన్న ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఇప్పటికే వీరు ఓబులేసుపై కిడ్నాప్ కేసు (సుమోటో) నమోదు చేశారు. నార్సింగిలోని అతని ఇంటి నుంచి ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తూటాలు గ్రేహౌండ్స్‌లో చోరీ చేసిన ఏకే-47వేనా లేక ఇతర ఆయుధానివా అనే విషయాన్ని ఇంకా తేల్చుకోవాల్సి ఉంది.
పోలీసు కస్టడీకి ఓబులేసు
Published Tue, Nov 25 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement