10 నుంచి అర్హులందరికీ ‘ఆసరా’ | on 10th from asara | Sakshi
Sakshi News home page

10 నుంచి అర్హులందరికీ ‘ఆసరా’

Published Thu, Dec 4 2014 2:46 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

10 నుంచి అర్హులందరికీ ‘ఆసరా’ - Sakshi

10 నుంచి అర్హులందరికీ ‘ఆసరా’

ప్రగతినగర్ : జిల్లాలో అర్హులైనవారందరికీ ఈ నెల 10వ తేదీ నుంచి పింఛన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.  అర్హులకు  పింఛన్లు అందేలా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోందన్నారు. పింఛన్లపై వికలాంగుల కు అనుమానాలు అవసరం లేదని, ఏ ఒక్కరికీ అ న్యాయం జరగకుండా చూస్తామన్నారు. అర్హులందరికీ ఆసరా కల్పిస్తామన్నారు.

వికలాంగులు అనే పదాన్ని వాడకూడదని, వారికి ఆ పదం పదేపదే ఉచ్చరించి మనం తప్పుపని చేస్తున్నామన్నారు. వికలాంగులు అన్నప్పుడల్లా వారు మనోవేదనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అం దువల్ల వారిని  విభిన్న ప్రతిభావంతుల కింద లెక్కించాలని సూచించారు.  ఆస రా పథకం కేవలం వికలాంగులకు కాస్త ఆసరా క ల్పించడానికి మాత్రమే అని, దానినే జీవితం అ నుకోకూడదన్నారు. వారు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా అందరితో పాటు సమాజంలో ముందుకుసాగాలని కోరారు. వికలాంగుల్లో కూడా ఎంతోమంది చక్కని ప్ర తిభ కనబరుస్తున్నారన్నారు. జిల్లాలో ఎంతో మంది వికలాంగులు దేశ విదేశాల్లో తమ ప్రతి భను చాటి జిల్లాకు తలమానికంగా నిలిచారన్నా రు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సదరం శిబిరంపై ఆం దోళన చెందవద్దన్నారు. సదరం శి బిర మే వికలాంగుల వద్దకు వచ్చేవిధంగా చూస్తామన్నారు.     
 
వైకల్యం ఎవరిలో ఉండదు.
- నగర మేయర్ ఆకుల సుజాత
 వైకల్యం అనేది  ఏ ఒక్కరిలో ఉండదని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు.  గతంలో జరిగిన ప్రమాదంలో తాను కూడా కాలు కోల్పోయానని, ప్రస్తుతం తన కాలులో రాడు ఉండి తాను కూడా వికలాంగురాలిగా ఉన్నానని అన్నారు. వికలాంగులు పడే బాధలు తనకు తెలుసునని, కానీ  వారు  ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు.  వికలాం గుల కోసం తాను శాయశక్తుల  కృషి చేస్తానని అన్నారు. అనంతరం అదనపు జేసీ మాట్లాడుతూ   ప్రభుత్వం  విభిన్న ప్రతిభావంతుల కోసం పలు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోం దని, వాటిని ఉపయోగించుకొని  ఆర్థికంగా ఎదగాలన్నారు.
 
బహుమతుల ప్రదానం
అనంతరం వికలాంగుల సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆ కట్టుకున్నాయి.  స్నేహ సొసైటీ , ఏపీ ఫోరం , ఆర్వీఎం విభిన్న ప్రతిభావంతులు నిర్వహించిన ప్రదర్శనకు గాను బహుమతులను అందజేశారు. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో కొత్తగా తీసుకువచ్చిన 70 ట్రై సైకిళ్లను , వీల్‌చైర్‌లను వికలాంగులకు కలెక్టర్ అందజేశారు.  

ఇటీవలే అంతర్జాతీ య స్థాయిలో రికార్డు సాధించిన వారిని కూడా శాలువతో సన్మానిం చా రు.  ఇవే కాకుండా అవసరమైతే వికలాంగుల సంక్షేమ శాఖల ఇతర వికలాంగుల ప రికరాల కోసం ఆ శాఖ ఎండీతో మాట్లాడినట్లు, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో వికలాంగ సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం,  మెప్మా పీడీ సత్యనారాయణ,  ఆర్వీఎం పీఓ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement