సాక్షి, మెదక్: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వితంతవులకు, బీడీ కార్మికులకు పెన్షన్‌లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ప్రశంసించారు. అంగన్‌వాడీల ద్వారా మాత, శిశువులకు పోషక ఆహారాన్ని ఇస్తున్నామని తెలిపారు. రేపటి భావిభారత పౌరుల నిర్మాణానికి పోషకాహారం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు.
సంగారెడ్డి: ఆందోల్, జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం జోగిపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోల్ మండలానికి చెందిన 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment