తిమ్మానగర్‌లో సమస్యలపై పద్మాదేందర్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న పలువురు గ్రామస్తులు
మెదక్ రూరల్: ఎన్నికల వేడి ఊపందుకుంటొంది. ఒకరిపై ఒకరు వ్యూహప్రతివ్యూహాలకు తెరలేపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయం ప్రదర్శిస్తూ సమస్యాత్మక వాతావరణానికి ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి పరిణామాలు బుధవారం మెదక్ మండలంలో జరిగిన ప్రచారంలో స్పష్టమయ్యాయి. మెదక్ మండలంలో టీఆర్‌ఎస్ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో శివాయిపల్లి, తిమ్మానగర్ గ్రామాల్లో ప్రచారం ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయా గ్రామాలకు చెందిన ఇద్దరు, ము గ్గురు వ్యక్తులు రోడ్లు, గ్రామాభివృద్ది, ఇళ్లు వంటి సమస్యలపై నిలదీసే ప్రయత్నం చేశారు. గ్రామానికి ఏం చేశారని, ఓట్లు అడిగేందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తుండగా అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కా ర్యకర్తలు తిరగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకానొక దశలో దాడి ప్రతి దాడులు చేసుకునే వరకు దారితీసింది.
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
ఓటమి భయంతోనే కాంగ్రెస్ వాళ్లు ప్రతి గ్రామంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టి ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రచారంలో ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారని ప్రజలు ఎవరిని నమ్మితే వారికే ఓటు వేస్తారన్నారు. సిద్దాంతపరంగా ఎన్నికల ప్రచారానికి గ్రామాలకు వెళ్ళాలి. కానీ సమస్యాత్మకంగా ఉండకూడదని హితవు పలికారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు పద్దతి మార్చుకోవాలని, లేకుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ వాళ్లు తమాషా చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో కాంగెస్ ప్రచారం నిర్వహిస్తే అడ్డుకోవడానికి తమ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని ఘాటుగా వాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment