పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలి | Panchayat Secretaries Demand To Reduce The Heavy Workload | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలి

Published Tue, Sep 17 2019 11:59 AM | Last Updated on Tue, Sep 17 2019 11:59 AM

Panchayat Secretaries Demand To Reduce The Heavy Workload - Sakshi

నిరసన తెలుపుతున్న పంచాయతీ కార్యదర్శులు

సాక్షి, ములుగు: పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోలు రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి జాతీయ రహదారి మీదుగా కలెక్టరేట్‌ కార్యాలయం వరకు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం డీఆర్వో కూతాటి రమాదేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ఒత్తిడిని తట్టుకోలేక  నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేటమండలం గుమ్మడిగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గురువారం ఆత్మహత్య చేసుకుందన్నారు. జూనియర్‌ పంచాయితీ కార్యదర్శులకు పేస్కేల్‌ , ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న స్రవంతి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్సిగ్రేషియ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు కొండల్‌రెడ్డి, చిరంజీవి, ఇమ్మడి దామోదర్‌ ఆయా గ్రామల పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement