
ఈ చిన్నారులను చూస్తే హృదయం తరుక్కుపోతుంది. గుండె బరువెక్కుతుంది. బతుకు బాటలో కష్టాల కడలిని ఈదుతున్నారు. కోవిడ్ తెచ్చిన పరిణామాలతో పరితపిస్తున్నారు. గోపన్‌పల్లి తండా సమీపంలో గృహ నిర్మాణ పనులు చేస్తున్న కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు పాస్‌ల కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పాస్‌లు దొరక్కపోవడంతో రెండు రోజులుగా ప్రధాన రహదారే వీరికి ఆవాసంగా మారింది. గురువారం వలస జీవుల పిల్లలు ఒకే ప్లేట్‌లో ఇలాఅన్నం తింటూకనిపించారు.
అరబిక్ చదువుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి గతంలో నగరానికి వచ్చిన ముస్లించిన్నారులు వీరు. లాక్‌డౌన్ కారణంగా క్లాసులు లేకపోవడంతో తిరిగి స్వరాష్ట్రాలకువెళ్లేందుకు పేర్ల నమోదు కోసం గురువారం కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఇలా నిరీక్షించారు.