హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఓ రోగి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలానికి చెందిన పి.శివకుమార్ (24) అస్వస్థత గురై చికిత్స నిమిత్తం ఈనెల 22న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇన్‌పేషెంట్‌గా చేరిన శివకుమార్ అదేరోజు సాయంత్రం మూత్రం పోసేందుకు బయటకు వెళ్లి తిరిగి వార్డుకు రాలేదు.
సన్నిహితులు, బంధుమిత్రులతో పాటు శివకుమార్ స్వగ్రామంలోను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తండ్రి రామదాసు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.