హైదరాబాద్: ఈసెట్, పీజీసెట్‌ల షెడ్యూళ్లు ఖరారయ్యాయి. ఈ రెండు సెట్ల బాధ్యతలు చూస్తున్న కమిటీలు గురువారం ఉన్నత విద్యా మండలిలో సమావేశమై షెడ్యూళ్లను ఖరారు చేశాయి. ఈ నెల 8వ తేదీన ఈ సెట్ల నోటిఫికేషన్లు వెలువడతాయి. ఈసెట్ దరఖాస్తులు 9 నుంచి, పీజీసెట్ దరఖాస్తులు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు సెట్లకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. ఈసెట్‌కు దరఖాస్తు రుసుము రూ.250గా నిర్ణయించారు. పీజీసెట్ దరఖాస్తు రుసుము రూ.500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు. ఈసెట్‌కు కొత్తగా ప్రొద్దుటూరులో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీజీసెట్‌కు కాకినాడ కేంద్రంగా రీజనల్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఈ సమావేశంలో ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ లాల్ కిషోర్, కన్వీనర్ ప్రొఫెసర్ బి.భానుమూర్తి, పీజీసెట్ చైర్మన్ డాక్టర్ బి.ప్రభాకర్‌రావు, కన్వీనర్ జీవీఆర్ ప్రసాదరాజు, మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు.