ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు బుధవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాలలో సుమారు రూ.5 లక్షల నగదును సీజ్ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు కోదాడ-ఖమ్మం మార్గంలో వెంకటగిరి వద్ద వాహనాలను తనిఖీ చేయగా రూ.2.5 లక్షల నగదు పట్టుబడింది. అలాగే, వరంగల్-ఖమ్మం మార్గంలో కాకిరాజుగూడెం వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.5 లక్షల నగదు వెలుగు చూసింది. ఈ రెండు ఘటనల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
‘పాలేరు’ పరిధిలో రూ.5 లక్షలు పట్టివేత
Published Wed, May 11 2016 8:33 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
Advertisement
Advertisement