రాజన్నకే 'కోడ్'...రామన్నకు లేదా...?! | Poll code: YSR statue masked, but NT Ramarao statue... | Sakshi

రాజన్నకే 'కోడ్'...రామన్నకు లేదా...?!

Published Mon, Mar 17 2014 2:55 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

రాజన్నకే 'కోడ్'...రామన్నకు లేదా...?! - Sakshi

రాజన్నకే 'కోడ్'...రామన్నకు లేదా...?!

ఎన్నికల కోడ్ అమలు గాడి తప్పుతోంది. అడుగడుగునా వివక్ష కొనసాగుతోంది. ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయం అనే రీతిలో అధికారులు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

ఎన్నికల కోడ్ అమలు గాడి తప్పుతోంది. అడుగడుగునా వివక్ష కొనసాగుతోంది. ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయం అనే రీతిలో అధికారులు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని వివిధ గ్రామాల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రెవెన్యూ సిబ్బంది ముసుగులు వేశారు.

కానీ మండలంలోని శంభునిగూడెం గ్రామంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి మాత్రం ముసుగు వేయలేదు. వైఎస్ఆర్ విగ్రహాలకు ముసుగు వేసి నాలుగు రోజులైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని విస్మరించటం ఎంతవరకు సమంజసమని స్థానికులు, టీడీపీయేతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement