మున్సిపాలిటీ భవనానికి కరెంట్ కట్! | Power cut to municipality building to recover dues | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ భవనానికి కరెంట్ కట్!

Published Sat, Nov 28 2015 5:05 PM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM

Power cut to municipality building to recover dues

సిరిసిల్ల (కరీంనగర్) : బిల్లులు చెల్లించడం లేదంటూ విద్యుత్ సరఫరాలు నిలిపివేయడం గురించి మనం వింటూనే ఉంటాం. అయితే అదే రూల్ మున్సిపాలిటీ భవనానికి కూడా వర్తించింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటి భవనానికి శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మున్సిపాలిటీవారు గత ఏడాది కాలంగా బిల్లు కట్టకపోవడంతో.. ప్రస్తుతం కోటి పదిలక్షల రూపాయలు బకాయి పడింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు.  దీంతో మున్సిపాలిటిలో అంధకారం అలుముకుంది. ఈ మేరకు సెస్ అదికారులు వివరాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement