రామగుండంలోని ఎన్టీపీసీ ఆరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
కరీంనగర్: రామగుండంలోని ఎన్టీపీసీ ఆరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పాడటం వల్ల నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే మరమ్మతులు పనులను చేపట్టారు. మిగతా యూనిట్లలో 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్తత్పి కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు.