- తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘంగా ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంఘాలుగా చీలిపోయిన ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలు తాజాగా మళ్లీ విలీనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆప్టా) మాజీ అధ్యక్షులు టి.సాయిబాబ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన జరిగిన సమావేశంలో రెండు సంఘాలు ఏకమై ‘తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్ పీటీఏ)గా ఆవిర్భవించాయి.
ఇకపై తెలంగాణలో టీఎస్ పీటీఏగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆప్టాగా వ్యవహరించాలని ఈ సమావేశంలో రెండు సంఘాల నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలోనే టీఎస్‌పీటీఏ గౌరవ అధ్యక్షులుగా వైఎస్ శర్మ, అధ్యక్షుడిగా కోట్ల నరసింహరావు, ప్రధాన కార్యదర్శిగా పిట్ల రాజయ్యను ఎన్నుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్తలుగా వైఎస్ శర్మ, షౌకత్ అలీలను ఎంపిక చేశారు.
జనవరి 3 నుంచి అర్ధవార్షిక పరీక్షలుండాలి : పీఆర్‌టీయూ టీఎస్
అర్ధ వార్షిక పరీక్షలను జనవరి 3 నుంచి 9 వరకు నిర్వహించాలని పీఆర్‌టీయూ టీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.సరోత్తం రెడ్డి, ఇతర నేతలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఎస్‌సీఆర్‌టీ డెరైక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ, హెల్త్ కార్డులపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావా రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.