ప్రారంభం కాని ‘పుర’ ఎన్నికల కసరత్తు | Process For Telangana Municipal Elections | Sakshi
Sakshi News home page

ప్రారంభం కాని ‘పుర’ ఎన్నికల కసరత్తు

Published Wed, Jun 12 2019 8:50 AM | Last Updated on Wed, Jun 12 2019 8:50 AM

Process For Telangana Municipal Elections - Sakshi

‘పుర’ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. జూన్‌ లేదా జూలై లోగా పూర్తవుతాయని భావించిన ఈ పోరుకు మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. పారదర్శక పాలన కోసం సీఎం కేసీఆర్‌ ప్రకటించిన కొత్త చట్టం రూపకల్పనలో జాప్యం.. గతేడాది మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తేలకపోవడం.. విభజనకు నోచుకోని వార్డులు.. వెరసి మున్సిపల్‌ ఎన్నికలకు సమయం పట్టనుంది. దీంతో ఐదు నెలలుగా వరుసగా జరుగుతున్న ఎన్నికలకు బ్రేక్‌ పడినట్లే.   ప్రచారం జరిగింది. ప్రజాప్రతినిధులు సైతం ‘పుర’ పోరుకు సన్నద్ధం కావాలని తమ కేడర్‌ను పలు సందర్భాల్లో సూచించారు. దీంతో కౌన్సిలర్‌గా పోటీకి సిద్ధమవుతోన్న ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. క్షేత్రస్థాయిలో తమ పట్టు కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు నెలలు కష్టపడితే చాలు ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలవొచ్చనే ధీమాతో తమ వార్డుల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వార్డుల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న సందర్భాలు పలు పురపాలికల్లో ఉన్నాయి.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పార్లమెంట్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల వెంటనే మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని జూన్‌ లేదా జూలై లోగా ఎన్నికలు పూర్తవుతాయని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు ‘పుర’పోరుకు అడ్డంకిగా మారాయి. గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల  తర్వాత సర్పంచ్, ఈ ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభ, మే నెలలో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. దీంతో ప్రాదేశిక ఎన్నికల వెంటనే మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడుతుందని.. జూన్‌ లేదా జూలై లోగా   ఎన్నికల నిర్వహణ పూర్తవుతుందనే ప్రచారం జరిగింది. ప్రజాప్రతినిధులు సైతం ‘పుర’ పోరుకు సన్నద్ధం కావాలని తమ కేడర్‌ను పలు సందర్భాల్లో సూచించారు. దీంతో కౌన్సిలర్‌గా పోటీకి సిద్ధమవుతోన్న ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. క్షేత్రస్థాయిలో తమ పట్టు కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు నెలలు కష్టపడితే చాలు ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలవొచ్చనే ధీమాతో తమ వార్డుల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వార్డుల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న సందర్భాలు పలు పురపాలికల్లో ఉన్నాయి.

‘కొత్త చట్టం’లో ఏముంటుందో? 
ఎన్నికలతో ముడిపడి ఉన్న మున్సిపల్‌ కొత్త చట్టంపై సర్వత్రా చర్చ మొదలైంది. అసలు ఈ చట్టం ఏతరహాలో ఉండబోతుంది? పుర‘పాలన’లో ఎలాంటి గుణాత్మక మార్పులు రానున్నాయి? అధికారులు, కౌన్సిలర్ల అధికారాలపై ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. పంచాయతీరాజ్‌ చట్టం మాదిరిగానే కొత్తగా మున్సిపల్‌ చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధికారుల్లో జవాబుదారి తనం పెరగడం.. అవినీతికి పాల్పడే, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు, సుపరిపాలన లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో కొత్త చట్టం రూపకల్పన జరుగుతోంది. చట్టం ఎంత మెరుగ్గా రూపకల్పన చేస్తే అంత మెరుగైన పాలన, సేవలు అందుతాయని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

విలీన సమస్య.. 
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎ లాంటి స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలు ఉండగా.. ఏ డాది క్రితం నారాయణపేట, అయిజ మి నహా 16 మున్సిపాలిటీల్లో మొత్తం 58 గ్రా మాలు విలీనం అయ్యాయి. సుమారు లక్ష మంది పట్టణ ఓటరు జాబితాలో చేరారు. అయితే ఈసారి జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కొత్తగా చేరిన ఓటర్లు కూడా ఓటేయాల్సి ఉంది. మూడు నెలల క్రితమే వి లీన గ్రామాల్లో జనాభా, ఓటర్ల లెక్కను ము న్సిపల్‌ అధికారులు తేల్చారు. విలీనానికి ముందు మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలో 2,17,942మంది ఓటర్లు ఉంటే.. పది విలీన గ్రామాలకు చెందిన 43,695 మంది ఓటర్లు కొత్తగా ఈ మున్సిపల్‌ పరిధిలో చేరారు.

దీంతో ఓటర్ల సంఖ్య 2,61,637కు పెరిగింది. 
ఇలా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓటర్ల తీరును పరిశీలిస్తే.. విలీన గ్రామాల్లో కొత్త వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒకటి, రెండు, మూడు గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో జనాభా తక్కువగా ఉంటే వాటిని ఆయా వార్డుల్లో కలుపుతారనే ప్రచారమూ జరుగుతోంది. ఇలా చేస్తే ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని మున్సిపాలిటీల్లోనూ వార్డుల విభజన అనివార్యమైంది. అదే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. వార్డులను ఏ ప్రాతిపదికన విభజిస్తుందో అనే చర్చ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement