సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 26 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సిటీ కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, బూర్గుల రామకృష్ణారావు భవన్, జీహెచ్‌ఎంసీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, మింట్ కాంపౌండ్, నిజాం కాలేజ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ థియేటర్, నాంపల్లి, అసెంబ్లీ పరిసరాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు.