సివిల్స్ సాధించడం సులభమే | rama chandrudu gives speach on how to get civils rank | Sakshi
Sakshi News home page

సివిల్స్ సాధించడం సులభమే

Published Thu, Jul 31 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

సివిల్స్ సాధించడం సులభమే

సివిల్స్ సాధించడం సులభమే

కరీంనగర్ : కృషి, పట్టుదల ఉంటే సివిల్స్ సాధించడం సులభమేనని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుడు రామచంద్రుడు అన్నారు. తెలంగాణ యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ యువతకు నిర్వహించిన సివిల్స్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సివిల్స్‌లో రాణించాలంటే పుస్తకాలు, పేపర్లు, టీవీలు చూడడం, కోచింగ్‌లకు వెళ్లడం ఎంత ప్రధానమో.. మనం ఎక్కడున్నా అక్కడి విషయూలు పరిగణనలోకి తీసుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
 
తెలంగాణలో అవగాహన కల్పించకపోవడం కారణంగానే తక్కువ మంది సివిల్స్ రాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్స్‌పై కరీంనగర్‌లో అవగాహన నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. సమష్టి కృషితో బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. సదస్సుకు హాజరైన పలువురు వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించగా రామచంద్రుడు క్లుప్తంగా సమాధానమిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ కడారు వీరారెడ్డి, కేయూ మాజీ వీసీ లింగమూర్తి, మాజీ డీన్ రవిప్రసాద్, యువ ఐఆర్‌ఎస్ అనుదీప్, తెలంగాణ యువజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కుడిది శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ గుర్రం వాసు, ఆరు జిల్లాలకు చెందిన 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement