రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : ఈ ఏడాది వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. నిర్మల్‌లోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలు కోసం జిల్లావ్యాప్తంగా 175 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో 105 కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగగా, మిగిలినవి మార్కెటింగ్, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేపట్టినట్లు వివరించారు. ప్రతీ ఏడాది సాధారణంగా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేదని, కానీ ఈసారి అనూహ్యరీతిలో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
ఊహించిన దానికంటే ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 3,23,977 ధాన్యం బస్తాలను కొనుగోలు చేశామన్నారు. వరి ధాన్యం కిలోకు రూ.36 చొప్పున ప్రభుత్వం ఐకేపీ సిబ్బందికి కమీషన్ రూపంలో చె ల్లిస్తుందని, మొత్తం ఐకేపీకి రూ.2 కోట్ల లాభం వస్తుందని అన్నారు. తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉందని, ధాన్యం తరలించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి ధాన్యాన్ని గోదాంలకు త రలిస్తామని అన్నారు. జేసీతోపాటు ఆర్డీవో అరుణశ్రీ, డీఎస్‌వో వసంత్‌రావు, ఐకేపీ మార్కెటింగ్ జిల్లా అధికారి చరణ్‌దాస్, తహశీల్దార్ సదానందం ఉన్నారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు
Published Sat, Jun 7 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement