
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 258.45 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, ఇందులో ఇప్పటికే జరిపిన కేటాయింపులు, వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ఉండే అవసరాలను పక్కనబెడితే మిగిలేవి కేవలం 155 టీఎంసీలేనని తెలంగాణ కృష్ణాబోర్డుకు తెలిపింది.
ఈ నీటిలో తెలంగాణకు 74.18 టీఎంసీ, ఏపీకి 80.86 టీఎంసీల మేర వాటా దక్కుతుందని తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ఇరు రాష్ట్రాలకు 21 టీఎంసీల అవసరాలు ఉంటాయని వివరించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ కృష్ణాబోర్డుకు నీటి వినియోగ లెక్కలు, దక్కే వాటాలపై వివరణ ఇస్తూ లేఖ రాసింది.