ఆ బాహుబలి వీరిలో ఒకరు! | revanth reddy funny comments on bahubhali in congress | Sakshi
Sakshi News home page

ఆ బాహుబలి వీరిలో ఒకరు!

Published Sun, Mar 19 2017 3:17 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

ఆ బాహుబలి  వీరిలో ఒకరు! - Sakshi

ఆ బాహుబలి వీరిలో ఒకరు!

హరీశ్‌ లేదా జానారెడ్డి కుమారుడు కావచ్చు: రేవంత్‌
సూర్యాపేట రూరల్‌: ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లోకి వచ్చే బాహుబలిని తాను కాదని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. అయితే.. సీఎం కేసీఆర్‌ చరిత్రంతా తెలిసిన మంత్రి హరీశ్‌రావు కావచ్చు, లేదా సీఎల్పీ నేత జానారెడ్డి కుమారుడైనా కావచ్చని సూర్యాపేట ఎల్కా రంలో శనివారం ఆయన విలేకరులతో చెప్పారు.

సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 22 లక్షల మంది ఇళ్లు లేని వారు ఉన్నారని చెప్పిన ప్రభుత్వం.. నేడు రెండు లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 1200 మంది అమరవీరులు చనిపోయింది ప్రభు త్వం ఇచ్చే గొర్రెల కోసమో, బర్రెల కోస మో కాదన్నారు. తెలంగాణలో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయని, నటుడు పవన్‌ కల్యాణ్‌ ముందు తెలంగాణ సమస్యలపై అవగాహన తెచ్చుకుని...  కల్పించుకొని, ఆ తర్వాత పార్టీ పెడితే బాగుంటుందని రేవంత్‌ సలహా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement