'పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేయండి' | rit filed against telangana congress mlcs | Sakshi
Sakshi News home page

'పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేయండి'

Published Tue, Jan 20 2015 1:42 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

'పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేయండి' - Sakshi

'పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేయండి'

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.  పార్టీ మారిన ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్ ఎం.ఎస్. ప్రభాకరరావు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  మరోవైపు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ విచారణలో జాప్యంపై  ఆపార్టీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఫిరాయింపులపై కోర్టు వ్యాఖ్యానిస్తూ..పార్టీ ఫిరాయింపులపై ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆడిటర్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా జనవరి 27వ తేదీలోగా కేసుపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement