
కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి
హైదరాబాద్ :
కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ఆదివారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. భార్య, భర్త, కూతురు మృతిచెందినట్లు చెబుతున్నారు. మృతులు నరసింహరావు(45), లలిత(35), శిరీష(15)లుగా గుర్తించారు. బీహెచ్‌ఈఎల్ నుంచి బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు సమాచారం.