
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం అర్థాంతరంగా ఆగిపోయింది. గత ఖరీఫ్‌లో రైతుబంధుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.8వేల చొప్పున నగదు అందజేయాలని నిర్ణయించింది. అయితే, ఖరీఫ్‌లో రైతుల చేతికి నగదు అందినప్పటికీ, రబీ సీజన్‌ది మాత్రం ఇంకా అన్నదాతల ఖాతాల్లో జమ కాలేదు. ఎన్నికల వేళ ఆగమేఘాల మీద రైతుల బ్యాంకు అకౌంట్లలో నిధులను డిపాజిట్ చేసిన సర్కారు.. ఆ తర్వాత రైతుబంధును దాదాపుగా నిలిపివేసింది.
జిల్లావ్యాప్తంగా 2,14,513 మంది రైతులకుగాను 1,87,854 మందికి పెట్టుబడి సాయం అందగా.. మరో 26,659 మంది ఎదురు చూస్తున్నారు. పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ఆర్థిక రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పథకం అమలుకు రూ.4500 కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ తేల్చింది. నిధుల కొరత కారణంగా ఇందులో రూ.380 కోట్లు ఇంకా కర్షకుల దరికి చేరలేదు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో మూడో వంతు రైతులకు డబ్బులు డిపాజిట్ చేసింది. గత నెల ఐదో తేదీ నుంచి ఇప్పటివరకు కొత్తగా ఒక రైతుకూ సాయం అందలేదని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
సాంకేతిక కారణాలను చూపుతూ అప్పుడు.. ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారని ఆయన వాపోయారు. మరోవైపు వివిధ కారణాలతో పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీకానీ రైతులు రబీ సీజన్‌లోనైనా పెట్టుబడి సాయం అందుతుందని ఆశించారు. అయితే, ఎన్నికల కమిషన్ ఆంక్షలతో వీరికి మోక్షం కలగలేదు. చేయూతనందిస్తోంది. రబీ సీజన్ డిసెంబర్‌తో ముగిసింది. అయినప్పటికీ, ఈ సీజన్ సాయం రాకపోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
రూ.24.73 కోట్లు రావాలి..
రబీ సీజన్‌లో పెట్టుబడి సాయం కింద జిల్లాకు రూ.204.17 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇంకా రూ.24.73 కోట్లు రావాల్సివుంది. ఖరీఫ్‌లో ప్రభుత్వమే చెక్కుల రూపేణా నగదును రైతులకు పంపిణీ చేసింది. రాష్ట్ర స్థాయిలోనే చెక్కులను ముద్రించి.. వ్యవసాయశాఖ ద్వారా అందజేసింది. అయితే, ఈ సారి ‘ముందస్తు’ ఎన్నికలు రావడంతో చెక్కుల పంపిణీకి బ్రేక్ పడింది. నేరుగా రైతుల ఖాతాలోనే సొమ్మును డిపాజిట్ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అంతేగాకుండా కొత్త లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చవద్దని ఆంక్షలు విధించింది.
దీంతో గత ఖరీఫ్‌లో సాయం అందినవారికే ఈసారి కూడా నగదును బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, నిధుల కటకట నేపథ్యంలో అన్ని జిల్లాలకు మన జిల్లా ట్రెజరీ నుంచే నిధులను మళ్లించింది. వివిధ పద్దుల కింద జమ అయ్యే నిధులను సర్దుబాటు చేస్తూ వచ్చింది. ఇలా నిధుల లభ్యతకు అనుగుణంగా రైతుబంధుకు సొమ్ము విడుదల చేసిన రాష్ట్ర సర్కారు తాజాగా చేతులెత్తేసింది. చేయూతనందిస్తోంది. రబీ సీజన్ డిసెంబర్‌తో ముగిసింది. అయినప్పటికీ, ఈ సీజన్ సాయం రాకపోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.