
వైరలైన ముర్తుజా ఫొటో ఇదే..
కాసిపేట(బెల్లంపల్లి) : ఓ వ్యక్తి ఫొటో మోజు.. అతనికి కొత్త తంటా తెచ్చి పెట్టిన సంఘటన మండలంలోని చిన్నధర్మారంలో గురువారం జరిగింది. ఆ ఫొటో సర్పంచ్ సీటుకు సంబంధించినది కావడంతో విషయం ఫిర్యాదుల దాకా వెళ్లింది. వివరాలు ఇ లా ఉన్నాయి. ఎన్నికైన చిన్నధర్మారం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ప్రేమవివాహం చేసుకున్న భూక్య సరిత అలియాస్ షేక్ సనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం గ్రామసభ అనంతరం సర్పంచ్ సమీప బంధువు ముర్తుజా ఆమె సీట్లో కూర్చొని ఫొటో దిగుతానని కోరడంతో ఆమె సరేనంది. దీంతో ముర్తుజా సర్పంచ్ సీట్లో కూర్చొని ఫోజులిస్తూ మరీ ఫొటోలు దిగాడు.
ఈ ఫొటోలను ముర్తుజా భార్య వాట్సప్ స్టేటస్‌లో పెట్టడం వివాదాస్పదమైంది. గురువారం ఉదయం వాటిని తొలగించినప్పటికీ.. అప్పటికే ప్రత్యర్థులు ఆ ఫొటోలను చాలామందికి షేర్ చేశారు. సర్పం చ్‌ను అవమానించడానికే ముర్తుజా ఇలా చేశాడనీ, అట్రాసిటీ కేసు పెట్టాలని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయమై సర్పం చ్‌ను వివరణ కోరగా కార్యాలయంలో ఎవరూ లేనప్పుడు తనను అడిగే ముర్తుజా కూర్చున్నాడు తప్పితే తనను అవమానించడానికి తెలిపారు. దీంతో వాట్సప్ వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment